Bengal Safari: సిలిగురి సఫారీలోకి నాలుగు పులి పిల్లల విడుదల

ABN , First Publish Date - 2022-10-11T14:37:37+05:30 IST

బెంగాల్ సఫారీలోకి(Bengal Safari) నాలుగు పులి పిల్లలను(Four Tiger Cubs) పశ్చిమబెంగాల్ జూ అథారిటీ(West Bengal Zoo Authority) అధికారులు విడుదల(Released)...

Bengal Safari: సిలిగురి సఫారీలోకి నాలుగు పులి పిల్లల విడుదల

సిలిగురి( పశ్చిమబెంగాల్): బెంగాల్ సఫారీలోకి(Bengal Safari) నాలుగు పులి పిల్లలను(Four Tiger Cubs) పశ్చిమబెంగాల్ జూ అథారిటీ(West Bengal Zoo Authority) అధికారులు విడుదల(Released) చేశారు. సిలిగురి నగరంలోని పులుల సఫారీలోని ఎన్‌క్లోజరులోకి ఆరు నెలల వయసున్న నాలుగు పులి పిల్లలను విడుదల చేశామని జూ అధికారులు చెప్పారు. షిలా అనే ఆడపులి ఆరేళ్లుగా సఫారీలో ఉంటుందని, అది మార్చి22వతేదీన నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందని అధికారులు పేర్కొన్నారు. బెంగాల్ సఫారీలో షిలా, రికా, తేజాల్, తారా, బివాన్ లనే ఐదు ఆడ పులులు ఉండగా, ఒకే మగ పులి ఉంది. నాలుగు పులి పిల్లలను బెంగాల్ అటవీశాఖ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్ బెంగాల్ సఫారీలోకి విడుదల చేశారని జూ పార్కు డైరెక్టర్ దేవా సంగం షేర్పా చెప్పారు. 


పులి పిల్లల ప్రవర్తనను పరిశీలించిన తర్వాతే సఫారీలోకి విడుదల చేశామని అధికారులు చెప్పారు. సిలిగురి జూపార్కుకు ఈ పులి పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సిలిగురిలో సింహాలు, ఎలుగుబంట్ల సఫారీలను ఏర్పాటు చేసేందుకు సెంట్రల్ జూ అథారిటీ ఆమోదం తెలిపిందని జూ డైరెక్టరు వివరించారు.


Updated Date - 2022-10-11T14:37:37+05:30 IST