prisoners escaped: జైలు నుంచి తప్పించుకున్న నలుగురు ఖైదీలు...కొట్టి చంపిన జనం

ABN , First Publish Date - 2022-09-12T14:48:57+05:30 IST

జైలు నుంచి తప్పించుకొని పారిపోతున్న నలుగురు ఖైదీలను(prisoners) జనం కొట్టి చంపిన ఘటన...

prisoners escaped: జైలు నుంచి తప్పించుకున్న నలుగురు ఖైదీలు...కొట్టి చంపిన జనం

షిల్లాంగ్ : జైలు నుంచి తప్పించుకొని పారిపోతున్న నలుగురు ఖైదీలను(prisoners) జనం కొట్టి చంపిన ఘటన మేఘాలయలోని పశ్చిమ జైంటియా హిల్స్ జిల్లాలో జరిగింది. మేఘాలయలోని జోవాయ్ జైలు(Meghalaya jail) నుంచి ఆరుగురు ఖైదీలు తప్పించుకొని పారిపోయారు.(escaped) జైలు నుంచి తప్పించుకున్న అండర్ ట్రయల్ ఖైదీల్లో (undertrial prisoners)ఐదుగురు షాంగ్ పుంగ్ గ్రామానికి చేరుకున్నారు.తప్పించుకున్న ఖైదీల్లో ఒకరు ఆహారం కోసం ఓ టీ షాపునకు రావడంతో స్థానికులు అతన్ని ఖైదీగా గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశామని గ్రామ పెద్ద ఆర్ రాబన్ చెప్పారు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు అటవీప్రాంతంలో దాక్కున్నారని తెలుసుకొని గ్రామస్థులు ఆగ్రహంతో కర్రలు పట్టుకొని వచ్చి వారిని కొట్టారు( beating).(apprehending the prisoners)


 గ్రామస్థుల దాడిలో నలుగురు ఖైదీలు మరణించగా, మరో ఖైదీ పారిపోయాడు.గ్రామస్థుల దాడిలో నలుగురు ఖైదీలు మరణించారని జైళ్ల శాఖ ఐజీపీ జేకే మారక్ చెప్పారు.తప్పించుకున్న ఆరవ ఖైదీ కూడా కనిపించకుండా పోయాడు. మేఘాలయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Read more