అక్రమాల కేసులో Punjab Congress మాజీ మంత్రి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-07T15:48:09+05:30 IST

పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ ధరమ్‌సోత్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయ్యారు....

అక్రమాల కేసులో Punjab Congress మాజీ మంత్రి అరెస్ట్

చండీఘడ్ : పంజాబ్ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ ధరమ్‌సోత్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయ్యారు.అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధుసింగ్ ధరమ్‌సోత్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. సాధుసింగ్ కెప్టెన్ అమరీందర్ సింగ్ కేబినెట్‌లో పంజాబ్ అటవీ, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి.సింగ్ పంజాబ్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చొప్పున లంచం తీసుకున్నారని విజిలెన్స్ ఆరోపించారు.దళితుల స్కాలర్‌షిప్ పథకాల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా సాధు సింగ్ పై ఆరోపణలు వచ్చాయి.


Read more