పాటియాలా నుంచి కెప్టెన్ ..తొలి జాబితా రిలీజ్

ABN , First Publish Date - 2022-01-23T21:09:00+05:30 IST

పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది పార్టీ అభ్యర్థుల..

పాటియాలా నుంచి కెప్టెన్ ..తొలి జాబితా రిలీజ్

చండీగఢ్: పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్‌సీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ 22 మంది పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. పాటియాలా నియోజకవర్గం నుంచి కెప్టెన్ పోటీ చేయనున్నారు. మొత్తం 22 మంది అభ్యర్థుల్లో మఝా ప్రాంతం నుంచి ఇద్దరు అభ్యర్థులను, డొయబ నుంచి ముగ్గురు, మాల్వా ప్రాంతం నుంచి 17 మందిని ఎంపిక చేసినట్టు అమరీందర్ సింగ్ తెలిపారు. రెండో జాబితాను మరి రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు.


బీజేపీ, సుఖ్‌దేవ్ సింగ్ థిండ్సా సారథ్యంలోని శిరోమణి అకాలీ దళ్ (సంయుక్త్) పొత్తుతో పీఎల్‌సీ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మూడు పార్టీలకు కలిపి ఉమ్మడి మేనిఫెస్టో ఉండబోతోంది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Read more