D. Jayakumar: మాజీ మంత్రి జయకుమార్‌కు ఊరట

ABN , First Publish Date - 2022-10-01T15:54:15+05:30 IST

మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar)పై నమోదైన స్థల కబ్జాకేసును మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. దురైపా

D. Jayakumar: మాజీ మంత్రి జయకుమార్‌కు ఊరట

                       - కబ్జా కేసు రద్దు చేసిన హైకోర్టు


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 30: మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar)పై నమోదైన స్థల కబ్జాకేసును మద్రాసు హైకోర్టు రద్దు చేసింది. దురైపాక్కంలో 8 గ్రౌండ్ల స్థలం కోసం మాజీ మంత్రి జయకుమార్‌ అల్లుడు నవీన్‌కుమార్‌, ఆయన సోదరుడు మహేష్ కుమార్‌ మధ్య వివాదం నెలకొంది. జయకుమార్‌ తన అనుచరులతో బెదిరించి స్థలం ఆక్రమించుకోవడంతో పాటు హత్యా బెదిరింపుకు పాల్పడినట్లు మహే్‌షకుమార్‌ ఫిర్యాదు చేశాడు. దాని ఆధారంగా జయకుమార్‌, ఆయన అల్లుడు నవీన్‌కుమార్‌, కుమార్తె జయప్రియలపై హత్యా బెదిరింపు సహా ఆరు సెక్షన్ల కింద చెన్నై కేంద్ర నేర విభాగం పోలీసులు కేసు నమోదుచేశారు.ఈకేసు రద్దుచేయాలని కోరుతూ జయకుమార్‌,నవీన్‌కుమార్‌, జయప్రియ దాఖలుచేసిన పిటిషన్‌ విచారించిన మద్రాసు హైకోర్టు తేది ప్రకటించకుండా తీర్పు వాయిదావేసింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు న్యాయమూర్తి ఇళందిరైయన్‌ మాజీ మంత్రి జయకుమార్‌ తరఫు వాదనలు పరిగణలోకి తీసుకొని ఆయనపై నమోదైన కేసు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఆయన అల్లుడు నవీన్‌కుమార్‌, కుమార్తె జయప్రియలపై నమోదైన కేసు కూడా రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2022-10-01T15:54:15+05:30 IST