Former Minister: విద్యుత్‌ ఛార్జీల పెంపు దృష్టి మరల్చేందుకే దాడులు

ABN , First Publish Date - 2022-09-14T12:52:26+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మరల్చేందుకే డీఎంకే ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ దాడులు

Former Minister: విద్యుత్‌ ఛార్జీల పెంపు దృష్టి మరల్చేందుకే దాడులు

                               - మాజీ మంత్రి డి. జయకుమార్‌


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 13: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ప్రజల దృష్టి మరల్చేందుకే డీఎంకే ప్రభుత్వం ప్రతిపక్ష నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేయిస్తోందని మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, డా.సి.విజయభాస్కర్‌ ఇళ్లలో మంగళవారం ఏసీబీ జరిపిన తనిఖీలపై స్పందించిన జయకుమార్‌ ఈ మేరకు డీఎంకే(DMK) ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 15నెలలుగా అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎన్నో ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని, గుట్టుచప్పుడు కాకుండా ఆస్తి పన్ను పెంచడమే కాకుండా తాజాగా విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజలపై మరింత భారం మోపారని, వీటిపై ప్రజలు విమర్శించకుండా దారి మళ్లించేందుకు ఏసీబీని ప్రభుత్వం పావులుగా వినియోగిస్తోందని జయకుమార్‌ ధ్వజమెత్తారు.

Updated Date - 2022-09-14T12:52:26+05:30 IST