National Conference: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా

ABN , First Publish Date - 2022-11-18T10:04:34+05:30 IST

జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సి) చీఫ్‌ పదవికి ఫరూక్‌ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు..

National Conference: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ పదవికి ఫరూక్ అబ్దుల్లా రాజీనామా
Farooq Abdullah

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సి) చీఫ్‌ పదవికి ఫరూక్‌ అబ్దుల్లా గుడ్ బై చెప్పారు.మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) శుక్రవారం జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (Jammu and Kashmir National Conference)(JKNC) పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.దీంతో ఫరూక్ వారసుడిగా ఒమర్ (Omar Abdullah)అధ్యక్షుడిగా రానున్నారు. శ్రీనగర్‌లో తన పార్టీ కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

తన ఆరోగ్యం సరిగా లేనందు వల్ల ఇప్పుడు పార్టీని నడిపించలేనని ఫరూక్ చెప్పారు.పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ కొత్త పార్టీ అధ్యక్షుడిగా డిసెంబర్ 5వతేదీన ఎన్నుకోనున్నారు.

Updated Date - 2022-11-18T10:54:55+05:30 IST