Bellary: ముంపు గ్రామాలకు కదిలిన యంత్రాంగం

ABN , First Publish Date - 2022-09-11T17:35:01+05:30 IST

వరద బాధిత గ్రామాలకు అధికార యంత్రాంగం కదిలింది. పత్రికలు, టీవీల్లో బాధిత గ్రామాల్లో ప్రజలు పడుతు న్న ఇబ్బందులపై వెలుగులోకి

Bellary: ముంపు గ్రామాలకు కదిలిన యంత్రాంగం

- పశువులకు మేత సరఫరా 

- వరద గ్రామాల్లో నిత్యవసరాల పంపిణీ: డీసీ


బళ్లారి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వరద బాధిత గ్రామాలకు అధికార యంత్రాంగం కదిలింది. పత్రికలు, టీవీల్లో బాధిత గ్రామాల్లో ప్రజలు పడుతు న్న ఇబ్బందులపై వెలుగులోకి రావడంతో శనివారం జిల్లా అధికారులు తరలి వెళ్లారు. బసరకోడు, మోకా, ఇతర నదీతీర ప్రాంతాల్లో రెవెన్యూ, వ్యవసాయశాఖ, వైద్యశాఖ(Department of Revenue, Department of Agriculture, Department of Medicine) అధికారులు పర్యటించారు. అక్కడ నిరాశ్రయులకు దుప్పట్లు, నిత్యావసర సరుకులు, దుస్తులు, పశువులకు మేత పంపిణీ చేశారు. వరద కొనసాగుతుండడంతో ప్రజలు భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు గ్రామాలు వదలి బంధువుల ఊళ్లకు వెళ్లగా మరి కొందరు పశువులు, మేకలు ఉండడంతో గ్రామాల్లో ఉంటున్నారు. వరద ముంపు గ్రా మాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బసరగోడు గ్రామప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తహసీల్దార్‌ విశ్వనాథ్‌ శనివారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో జిల్లాయంత్రాంగం ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రంలో తహసీల్దార్‌ ప్రజలతో కలిసి భోజనం చేశారు. ఈనెల 6వ తేది నుంచి ప్రతిరోజు పిల్లలతో సహా 430 మందికి సంరక్షణ కేంద్రంలో తాత్కాలిక వసతి కల్పించామని తెలిపారు.

Read more