RSS leaders: పీఎఫ్ఐ హిట్ లిస్టులో హిందూ నేతలు...కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీ

ABN , First Publish Date - 2022-10-01T16:28:40+05:30 IST

నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హిట్ లిస్టులో ఉన్న ఐదుగురు రాష్ట్రీయ స్వయంసేవక్(RSS leaders) నాయకులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ...

RSS leaders: పీఎఫ్ఐ హిట్ లిస్టులో హిందూ నేతలు...కేంద్రం వై కేటగిరి సెక్యూరిటీ

న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా హిట్ లిస్టులో ఉన్న ఐదుగురు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS leaders) నాయకులకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం వై కేటగిరి సెక్యూరిటీ(high level security) కల్పించింది. కేరళ పీఎఫ్ఐ సభ్యుడు మహమ్మద్ బషీర్ ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల జరిపిన దాడుల్లో వారి హిట్ లిస్టుల్లో ఐదుగురు ఆర్ఎస్ఎస్ నాయకులున్నారని(PFIs hit list) వెల్లడైంది.పీఎఫ్ఐ(Popular Front of India) నేత ఇంట్లో లభించిన డాక్యుమెంటులో ఆర్ఎస్ఎస్ హిట్ లిస్టు జాబితా దొరికింది. పీఎఫ్ఐపై విధించిన నిషేధం అనంతరం ఐదుగురు ఆర్ఎస్ఎస్ నేతలకు వారి నుంచి ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది. 


ఇంటెలిజెన్స్ బ్యూరో(central intelligence agencies) నివేదిక మేర కేంద్ర హోంమంత్రిత్వశాఖ(Ministry of Home Affairs) ఐదుగురు కేరళ ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి (Y category security)రక్షణ కల్పిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. 11మంది కేంద్ర భద్రతా బలగాలకు చెందిన జవాన్లతో ఆర్ఎస్ఎస్ నేతలకు రక్షణ కల్పించాలని కేంద్రం ఆదేశించింది. 

Updated Date - 2022-10-01T16:28:40+05:30 IST