నాతో పోరాటానికి.. నీ ఎలుగునూ తెచ్చుకో!

ABN , First Publish Date - 2022-03-16T08:03:12+05:30 IST

యుద్ధ బాధిత ఉక్రెయిన్‌కు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలందిస్తూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ద్వంద్వ ..

నాతో పోరాటానికి.. నీ ఎలుగునూ తెచ్చుకో!

  పుతిన్‌కు ఎలాన్‌ మస్క్‌ మళ్లీ సవాల్‌

వాషింగ్టన్‌, మార్చి 15: యుద్ధ బాధిత ఉక్రెయిన్‌కు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలందిస్తూ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ద్వంద్వ యుద్ధానికి రమ్మంటూ కవ్వించి.. వార్తల్లో నిలుస్తున్న అమెరికా అపర కుబేరుడు, ‘స్పేస్‌ఎక్స్‌’ చీఫ్‌ ఎలన్‌మ్‌స్క మరో సంచలన ట్వీట్‌ చేశారు. ‘‘పుతిన్‌.. నాతో పోరాటానికి కావాలంటే నీ ఎలుగుబంటిని కూడా తెచ్చుకో’’ అంటూ రెచ్చగొట్టేలా ట్వీట్‌ వదిలారు. అంతేకాదు, ఎలుగుబంటిపై పుతిన్‌ స్వారీ చేస్తుండగా, నిప్పులు కక్కుతున్న ఫ్లేమ్‌ త్రోయర్‌తో తాను టార్గెట్‌ చేస్తున్నట్లున్న ఫొటోను దీనికి జోడించారు.

Read more