Nitish Kumar: నితీష్ కుమార్ జేడీయూకి బీజేపీ మూడో షాక్

ABN , First Publish Date - 2022-09-13T13:41:09+05:30 IST

కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు(shock) ఇస్తున్నారు....

Nitish Kumar: నితీష్ కుమార్ జేడీయూకి బీజేపీ మూడో షాక్

న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని(Nitish Kumars Party) జేడీయూ బీజేపీ( BJP)తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్నాక, కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్‌ల మీద షాక్‌లు(shock) ఇస్తున్నారు. డయ్యూ డామన్(Daman And Diu) ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులుండగా వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు డయ్యూ డామన్ జేడీయూనేతలు కూడా బీజేపీ((Bharatiya Janata Party) తీర్థం స్వీకరించారు. బీజేపీతో మైత్రిబంధాన్ని తెంచుకున్న నితీష్ కుమార్ అవినీతి పార్టీ ఆర్జేడీతో కలిశారని, దానికి వ్యతిరేకంగానే తాము బీజేపీ చేరుతున్నట్లు డయ్యూడామన్ జేడీయూ నేతలు ప్రకటించారు. 


అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్రంలో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అనంతరం మణిపూర్ లో జేడీయూకు(Manipur JD(U) MLAs) ఆరుగురు ఎమ్మెల్యేలు ఉండగా, ఐదుగురు బీజేపీలోకి ఫిరాయించారు. మణిపూర్( Manipur) లో ఐదుగురు జేడీ యూ(Janata Dal United) ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమయ్యారని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. మైత్రీబంధం తెగిన తర్వాత బీజేపీ బీహార్ సీఎం నితీష్ కుమార్ కు మూడోసారి షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యే టేకి కసో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. 2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేలు విజయం సాధించగా వారందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయకండువాలు కప్పుకున్నారు. 


Updated Date - 2022-09-13T13:41:09+05:30 IST