ఫీల్డ్ అసిసెంట్ల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2022-03-16T07:59:54+05:30 IST
విధుల నుంచి తొలగించారన్న కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన 70 మంది పైగా ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు..

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): విధుల నుంచి తొలగించారన్న కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన 70 మంది పైగా ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారాన్ని అందించాలని ఆప్ నేత సోమ్నాథ్ భారతి డిమాండ్ చేశారు. ఇందిరా శోభన్తో కలిసి మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి తొలగించిందని, దీనిపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మాట్లాడలేదని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల కోసం కేంద్రం అందిస్తున్న నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు.