ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌-2 పరీక్షలు

ABN , First Publish Date - 2022-03-12T07:14:48+05:30 IST

సీబీఎ్‌సఈ పరిధిలోని 10, 12వ తరగతి టర్మ్‌-2 బోర్డు పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి...

ఏప్రిల్‌ 26 నుంచి  సీబీఎస్‌ఈ టర్మ్‌-2 పరీక్షలు

10, 12వ తరగతుల విద్యార్థులకు కూడా

ప్రిపరేషన్‌ కోసం పరీక్షల మధ్య చాలినంత వ్యవధి

ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌-2 పరీక్షలు

 10, 12వ తరగతుల విద్యార్థులిద్దరికి కూడా


హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సీబీఎ్‌సఈ పరిధిలోని 10, 12వ తరగతి టర్మ్‌-2 బోర్డు పరీక్షల షెడ్యూల్‌  విడుదలైంది. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 10, 12వ తరగతులకు రెండు టర్మ్‌ల్లో బోర్డు పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి టర్మ్‌ పరీక్షలను ఇప్పటికే నిర్వహించారు. రెండో టర్మ్‌ 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26న ప్రారంభమై, మే 24వ తేదీన ముగియనున్నాయి. అలాగే 12వ తరగతికి సంబంధించిన రెండో టర్మ్‌ పరీక్షలు ఏప్రిల్‌ 26న ప్రారంభమై జూన్‌ 15వ తేదీన ముగియనున్నాయి. ఈ పరీక్షలను ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా బడులు చాలాకాలం మూతపడి తరగతులపై ప్రభావం పడడంతో.. విద్యార్థులు పరీక్షలకు చాలినంత సన్నద్ధం కావడానికి రెండు పరీక్షల మధ్య కావాల్సినంత వ్యవధి ఇచ్చామని సీబీఎ్‌సఈ అధికారులు తెలిపారు.

Read more