రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

ABN , First Publish Date - 2022-07-10T17:41:09+05:30 IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, మాదకద్రవ్యాలకు నిలయంగా రాష్ట్రం మారుతోందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత పొన్‌. రాధాకృష్ణన్‌

రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు

                                - Ex Minister పొన్‌ రాధాకృష్ణన్‌


పెరంబూర్‌(చెన్నై), జూలై 9: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, మాదకద్రవ్యాలకు నిలయంగా రాష్ట్రం మారుతోందని  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత పొన్‌. రాధాకృష్ణన్‌ ఆరోపించారు. రామనాథపురంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, అగ్నిపథ్‌ పథకాన్ని యువత ఆదరిస్తున్నారని, కేవలం రాజకీయం కోసం కొందరు ఈ పథకాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఏడాది కాలంలోనే దేశంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయని, అందుకే ‘ఒకే దేశం...ఒకే ఎన్నిక’ను బీజేపీ ప్రతిపాదిస్తోందని అన్నారు. అన్నాడీఎంకే వ్యవహారంపై తాము జోక్యం చేసుకోవడం లేదని, అందరూ సమష్టిగా ఉండాలనేదే తమ అభిప్రాయమని అన్నారు. ఇళయరాజాకు ఎంపీ పదవికి ఎంపిక చేయడంలో ఎలాంటి స్వార్థం లేదని, తమిళ సినీ సంగీతంలో జాంబవంతుడిగా ఉన్న ఆయనకు ఎంపీ పదవి దక్కడం ప్రతి తమిళుడికి గర్వంగా ఉందని రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు.

Read more