ఇంతవరకు గోమాంసం తినలేదు: Ex Cm

ABN , First Publish Date - 2022-05-24T17:29:43+05:30 IST

ఇప్పటి వరకు గో మాంసం తినలేదని, తినాలనిపిస్తే తింటానని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం తుమకూరులో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ

ఇంతవరకు గోమాంసం తినలేదు: Ex Cm

- తినాలనిపిస్తే తింటా 

- ప్రతిపక్షనేత సిద్దరామయ్య 


బెంగళూరు: ఇప్పటి వరకు గో మాంసం తినలేదని, తినాలనిపిస్తే తింటానని ప్రతిపక్షనేత సిద్దరామయ్య పేర్కొన్నారు. సోమవారం తుమకూరులో ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ తాను ఏం తినాలనేది తన సొంత నిర్ణయమన్నారు. కేవలం ముస్లింలు మాత్రమే గోమాంసం తీసుకోరన్నారు. హిందువులు, క్రిస్టియ న్లు కూడా తింటారన్నారు. ఎవరెవరి ఆహార పద్ధతి వారి సొంత నిర్ణయమ న్నారు. దేశంలో 1964 నుంచే గోవధ నిషేధ చట్టం ఉందని, వాటికి సవరణలు చేసి చట్టం తెచ్చారన్నారు. కానీ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాత చట్టాన్ని తీసుకొచ్చానన్నారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం మరోసారి మార్పు చేసిందన్నారు. అప్పట్లో శాసనసభలో చెప్పినట్టుగా ఆహార పద్ధతి పట్ల చట్టం చేయడం సరికాదన్నారు. తాను హిందువునని, తాను ఏం తినాలనేది తన స్వయం హక్కు అన్నారు. కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నిర్ణయాలు సరికావన్నారు. గోవధ ని షేధం ఇప్పటికే అమలులో ఉందని, కానీ బీజేపీ ముస్లింలను దృష్టిలో ఉంచుకుని సవరణ చేయడాన్ని శాసనసభలో వ్యతిరేకించానన్నారు. 

Read more