హింసను ప్రేరేపిస్తున్న డీఎంకే: Ex cm

ABN , First Publish Date - 2022-02-19T16:03:23+05:30 IST

అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న కోయంబత్తూరు జిల్లాల్లో నగరపాలక, పురపాలక ఎన్నికల్లో హింసను ప్రేరేపించేందుకు అధికార పార్టీ కుట్రపన్నుతోందని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వా

హింసను ప్రేరేపిస్తున్న డీఎంకే: Ex cm

చెన్నై: అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉన్న కోయంబత్తూరు జిల్లాల్లో నగరపాలక, పురపాలక ఎన్నికల్లో హింసను ప్రేరేపించేందుకు అధికార పార్టీ కుట్రపన్నుతోందని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కోయంబత్తూరు కార్పొరేషన్‌ను కైవసం చేసుకునే దిశగా డీఎంకే నాయకులు పోలీసుల సహకారంతో పోలింగ్‌ సిబ్బందికి విరివిగా డబ్బులు పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని వార్డుల్లో ఓటర్లకు నోట్లు పంపిణీ చేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. గత శాసనసభ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలో ఘోరపరాజయాన్ని చవిచూసిన డీఎంకే ఈసారి జిల్లాల్లో అన్ని చోట్లా గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతోందని చెప్పారు. జిల్లాల్లో అధికార పార్టీ జరుపుతున్న అక్రమాలపై అన్నాడీఎంకే స్థానిక నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడమే లేదని ఆరోపించారు. 

Read more