Former Chief Minister: ఈపీఎస్‌ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా

ABN , First Publish Date - 2022-08-24T15:55:45+05:30 IST

అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ పార్టీలో జంట నాయకత్వమే కొనసాగాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ

Former Chief Minister: ఈపీఎస్‌ పిటిషన్‌పై విచారణ మళ్ళీ వాయిదా

చెన్నై, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే సర్వసభ్యమండలి సమావేశం చెల్లదని, ఆ పార్టీలో జంట నాయకత్వమే కొనసాగాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) దాఖలు చేసిన అప్పీలుపై విచారణ మళ్ళీ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ సోమవారం ఉదయం న్యాయమూర్తులు ఎం.దురైసామి(M. Duraisamy), సుందర్‌మోహన్‌ ఎదుట విచారణకు వచ్చింది. ఈపీఎస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది విజయనారాయణన్‌ హాజరై సర్వసభ్యమండలి సమావేశానికి వ్యతిరేకంగా సింగిల్‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వు నఖలు ఇంకా అందలేదని, దాంతో నిమిత్తం లేకుండా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తులు కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. ఆ మేరకు మంగళవారం ఉదయం మళ్ళీ ఈ పిటిషన్‌ విచారణకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం తరఫు న్యాయవాది హాజరై ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది గురుకృష్ణకుమార్‌(Senior Advocate Gurukrishna Kumar) హాజరుకానుండటంతో కాస్త గడువు ఇవ్వాలని కోరారు. న్యాయమూర్తులు స్పందిస్తూ ఈ అప్పీలుపై మధ్యంతర ఉత్తర్వులుగానీ, స్టే గానీ జారీ చేసే అవకాశం లేదని, ఈ పరిస్థితుల్లో తుది విచారణ కోసం కేసును ఈ నెల 25కు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు.

Updated Date - 2022-08-24T15:55:45+05:30 IST