ట్విట్టర్‌లో ఎడిట్ బటన్‌పై ఎలాన్ మస్క్ రచ్చ

ABN , First Publish Date - 2022-04-06T00:40:13+05:30 IST

ఎడిట్ బటన్ ఉండాలని నువ్వు అనుకుంటున్నావా?’’ ఇది మస్క్ చేసిన పోల్ ట్వీట్. ఉదయం ఆరు గంటలకు మస్క్ ట్వీట్ చేయగా.. ఇప్పటికి 30 లక్షల మంది ఓటు వేశారు. అయితే ఎడిట్ బటన్ ఉండాలంటూ 73 శాతం మంది ఓటు వేయగా, అవసరం లేదని 27 శాతం మంది ఓట్ వేశారు..

ట్విట్టర్‌లో ఎడిట్ బటన్‌పై ఎలాన్ మస్క్ రచ్చ

ఇంటర్నెట్ డెస్క్: చాలా కాలంగా ట్విట్టర్‌ యాజమాన్యానికి యూజర్ల నుంచి చాలా డిమాండ్లు ఉన్నప్పటికీ.. ఎడిట్ బటన్ పెట్టాలనేది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. ఏదైనా తప్పుడు ట్వీట్ చేసినా, ట్వీట్‌లో ఏవైనా అక్షర దోషాలు, మరింకేదైనా తప్పిదాలు ఉన్నా.. సరి చేసుకోవడానికి అవకాశం లేదు. అవసరమైతే ఆ ట్వీట్ డిలీట్ చేసి కొత్త ట్వీట్ చేయాల్సిందే కానీ, ఒకసారి పోస్ట్ అయిన ట్వీట్‌లో ఇంకేమీ చేయలేం. కాగా, దీనిపై చాలా మంది చాలా రోజులుగానే ట్వీట్టర్‌ను డిమాండ్ చేస్తున్నప్పటికీ, ట్విట్టర్ యాజమాన్యం దీన్ని పట్టించుకోలేదు. తాజాగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం ఎడిట్ బటన్‌పై స్పందించారు. మస్క్ స్పందన అంటే మామూలుగా ఉండదుగా.. ట్విట్టర్‌లో ప్రస్తుతం దీనిపై రచ్చ లేసింది.


‘‘ఎడిట్ బటన్ ఉండాలని నువ్వు అనుకుంటున్నావా?’’ ఇది మస్క్ చేసిన పోల్ ట్వీట్. ఉదయం ఆరు గంటలకు మస్క్ ట్వీట్ చేయగా.. ఇప్పటికి 30 లక్షల మంది ఓటు వేశారు. అయితే ఎడిట్ బటన్ ఉండాలంటూ 73 శాతం మంది ఓటు వేయగా, అవసరం లేదని 27 శాతం మంది ఓట్ వేశారు. ఇక ఈ ట్వీట్‌పై ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కొన్ని పరిమితులతో, నిబంధనలతో ఎడిట్ బటన్ ఉండాలని కొందరు అంటుండగా.. కొందరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకునే విధంగా ఉండాలని కోరుతున్నారు. ఇక కొందరు అసలు ఎడిట్ బటనే అవసరం లేదని, ఎడిట్ బటన్ వస్తే ట్వీట్ వ్యాల్యూ తగ్గుతుందని అంటున్నారు.

Updated Date - 2022-04-06T00:40:13+05:30 IST