Electrical buses: రాజధానికి మరో 921 ఎలక్ట్రికల్‌ బస్సులు

ABN , First Publish Date - 2022-12-10T13:01:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఫేమ్‌ -2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్‌ ద్వారా కొత్తగా రాజధాని బెంగళూరు నగరం కోసం 921 ఎలక్ట్రికల్‌ బస్సుల(Electrical bu

Electrical buses: రాజధానికి మరో 921 ఎలక్ట్రికల్‌ బస్సులు

బెంగళూరు: కేంద్ర ప్రభుత్వ ఫేమ్‌ -2 పథకంలో భాగంగా సీఈఎస్ఎల్‌ ద్వారా కొత్తగా రాజధాని బెంగళూరు నగరం కోసం 921 ఎలక్ట్రికల్‌ బస్సుల(Electrical buses)ను కొనుగోలు చేసేందుకు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బస్సుల కొనుగోలు ఖర్చులో కొంత భరించనుంది. ఒక్కో ఎలక్ట్రికల్‌ బస్సు ధర రూ 1.50 కోట్లుగా ఉంటుందని ఇందులో కేంద్రం ప్రతిబస్సుకు రూ 39.08 లక్షలు భరించనుండగా మిగిలిన మొత్తాన్ని సీఈఎస్ఎల్‌ కంపెనీ సమకూర్చుకోనుంది. బీఎంటీసీ ఆధ్వర్యంలో ఈ బస్సుల సంచారం జరగనుంది. నగర శివారు ప్రాంతాలకు, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలకు ఈ కొత్త బస్సులను కేటాయించనున్నారు.

Updated Date - 2022-12-10T13:01:40+05:30 IST