Epsకు మద్దతుగా మళ్లీ లేఖలు

ABN , First Publish Date - 2022-07-02T13:16:01+05:30 IST

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా సర్వసభ్యమండలి సభ్యులు శుక్రవారం

Epsకు మద్దతుగా మళ్లీ లేఖలు

                            - జిల్లా శాఖల్లో ప్రత్యేక తీర్మానాలు 


చెన్నై, జూలై 1 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి మద్దతుగా సర్వసభ్యమండలి సభ్యులు శుక్రవారం లేఖలు రాశారు. ఈనెల 11న జరిగే సర్వసభ్యమండలి సమావేశం ఏకనాయకత్వంపై నిర్ణయం తీసుకునే దిశగానే కొనసాగాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. సర్వసభ్యమండలిలో 2665 మంది సభ్యులుండగా వారిలో 2441 మంది సభ్యులు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఓపీఎస్‌ వర్గంలో ఉన్న వారంతా రెండు మూడు రోజుల్లో ఈపీఎస్‌ పంచన చేరే అవకాశముంది. మరోవైపు సర్వసభ్యమండలి సమావేశానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా వుండగా మాజీ సీఎం ఎడప్పాడి తన ట్విట్టర్‌ పేజీలో మార్పు చేశారు. ఇప్పటివరకూ ఆ పేజీలో పార్టీ ఉప సమన్వయకర్త పేరుతో సందేశాలు పంపుతుండేవారు. శుక్రవారం ఉదయం పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పేరుతో సందేశాలు విడుదల చేశారు. అంతేకాకుండా మూడు రోజులకు ముందు తన లెటర్‌పాడ్‌లోనూ ఈపీఎస్‌ ఉపసమన్వయకర్త పేరిట కాకుండా పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పేరుతో ముద్రించిన కొత్త లెటర్‌పాడ్‌లను వాడుతున్నారు.  

Read more