ED raids: ఛత్తీస్‌ఘడ్ సీఎం సన్నిహిత అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-10-11T17:30:33+05:30 IST

ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh) రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహిత ప్రభుత్వ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED raids)అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు...

ED raids: ఛత్తీస్‌ఘడ్ సీఎం సన్నిహిత అధికారుల ఇళ్లపై ఈడీ దాడులు

రాయపూర్ (ఛత్తీస్‌ఘడ్) : ఛత్తీస్‌ఘడ్(Chhattisgarh) రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహిత ప్రభుత్వ అధికారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED raids)అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. సంపాదనకు మించిన అక్రమ ఆస్తులున్నాయని(properties linked to top Chhattisgarh officials) ఈడీ అధికారులు సీఎంకు( CM Baghel) సన్నిహితులైన సీనియర్ అధికారుల ఇళ్లలో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు.బీజేపేతర ముఖ్యమంత్రులున్న రాష్ట్రాల్లో ఈడీ(Enforcement Directorate) దాడులను ముమ్మరం చేసింది. సౌమ్యాచౌరాసియా, సీఎ విజయ్ మాలు, రాయగడ్ కలెక్టరు రాను సాహు, అగ్నిచంద్రాకర్, సూర్యకాంత్ తివారి, గనుల శాఖ అధిపతి జేపీ మౌర్యాల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు. 



అధికారులతోపాటు రాజకీయనేతలు, వ్యాపారవేత్తల ఇళ్లపై ఈడీ సోదాలు జరుపుతోంది. వికాస్ నిగం ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అగ్ని చంద్రాకర్, లక్ష్మీకాంత్ తివారీ, అజయ్ నాయుడు, సూర్యకాంత్ తివారీ, సన్నీ లునియాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. రాయగడ్ కలెక్టరు రాను షాహు ఇంటిపై 12 మంది ఈడీ అధికారులు వచ్చి సోదాలు జరిపారు. 

Updated Date - 2022-10-11T17:30:33+05:30 IST