phone tapping case: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-07T14:18:42+05:30 IST

అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో(illegal phone tapping case) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(National Stock Exchange) మాజీ చీఫ్ రవి నరేన్‌ను...

phone tapping case: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ చీఫ్ అరెస్ట్

ముంబయి: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో(illegal phone tapping case) నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(National Stock Exchange) మాజీ చీఫ్ రవి నరేన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)(Enforcement Directorate) అరెస్ట్ చేసింది.ముందు ఈడీ రవి నరేన్‌ను ఢిల్లీలో విచారణకు పిలిచి అరెస్టు(arrest) చేసింది. ఈడీ అధికారుల విచారణలో రవి నరేన్‌ సహకరించటం లేదని, అతనికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు చెప్పారు. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన రవి నరేన్‌ 1994 నుంచి 2013 సంవత్సరాల మధ్య వివిధ హోదాల్లో పనిచేశారు. 


ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో ముంబై మాజీ పోలీస్ కమిషనర్(former Mumbai Police Commissioner) సంజయ్ పాండేను ఈడీ అరెస్ట్ చేసింది.ఈ కేసుకు సంబంధించి మరో ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ చిత్రా రామకృష్ణను కూడా ఈడీ ప్రశ్నించింది. ఆమె ఇప్పటికే దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉంది.సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ విచారణను ప్రారంభించింది.


ఈ కేసులో దర్యాప్తు సంస్థ న్యూఢిల్లీకి చెందిన ఐఎస్ఈసీ (ISEC) సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సంతోష్ పాండే, ఆనంద్ నారాయణ్, అర్మాన్ పాండే, మనీష్ మిట్టల్, నమన్ చతుర్వేది,ఇతర అధికారులు, డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఉద్యోగుల టెలిఫోన్‌లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన మేరకు కేసు నమోదైంది. 


Updated Date - 2022-09-07T14:18:42+05:30 IST