Iran దేశంలో భారీ భూకంపం

ABN , First Publish Date - 2022-07-02T12:31:26+05:30 IST

ఇరాన్(Iran) దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది....

Iran దేశంలో భారీ భూకంపం

టెహ్రాన్ (ఇరాన్): ఇరాన్(Iran) దేశంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్ దేశం హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని ఓడరేవు నగరమైన బందర్ అబ్బాస్‌కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.ఈ భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు.ఈ భూకంపం ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. గత ఏడాది నవంబర్‌లో రిక్టర్ స్కేలుపై 6.4, 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపాల కారణంగా హార్మోజ్‌గాన్‌ ప్రావిన్స్‌లో ఒకరు చనిపోయారు.


పలు టెక్టోనిక్ ప్లేట్ల అంచున వివిధ ఫాల్ట్ లైన్‌లను దాటుతున్న ఇరాన్ దేశం బలమైన భూకంప కార్యకలాపాల ప్రాంతంగా పేరొందింది.1990వ సంవత్సరంలో ఇరాన్ దేశంలో అత్యంత ఘోరమైన భూకంపం సంభవించింది. 1990లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల ఉత్తర ఇరాన్ దేశంలో 40,000 మంది మరణించారు.


Updated Date - 2022-07-02T12:31:26+05:30 IST