Amit sha: డ్రీమ్ సెల్లర్స్ ఎప్పటికీ గుజరాత్‌లో గెలవరు

ABN , First Publish Date - 2022-09-14T01:03:27+05:30 IST

కలలు అమ్మేవారు జరాత్‌లో ఎప్పటికీ గెలవరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పరోక్షంగా..

Amit sha: డ్రీమ్ సెల్లర్స్ ఎప్పటికీ గుజరాత్‌లో గెలవరు

న్యూఢిల్లీ: కలలు అమ్మేవారు (Dream sellers) గుజరాత్‌లో ఎప్పటికీ గెలవరని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit sha) పరోక్షంగా ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)ను ఉద్దేశించి అన్నారు. గుజరాత్‌లో మరోసారి బీజేపీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భూపేంద్ర పటేల్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారంనాడు గాంధీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో అమిత్‌షా ప్రసంగించారు. భూపేంద్ర పటేల్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు.


గుజరాత్ ప్రజల గురించి తనకు బాగా తెలుసునని, కలలు అమ్మేవారిని వారు ఎప్పటికీ నమ్మరని, పనిచేసే వారినే గుజరాతీలు నమ్ముతారని అమిత్‌షా  అన్నారు. ఆ కారణంగానే ప్రజలు  బీజేపీ వైపే ఉంటారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే  ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం భూపేంద్ర సింగ్ నాయకత్వంలో బీజేపీ మరోసారి మూడింట రెండు వంతుల మెజారిటీలో గెలుచి తీరుతుందని అమిత్‌షా అన్నారు. ఈ డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Read more