సీఎంకు కాబోయే భార్య Dr Gurpreet అంబాలా ఆసుపత్రిలో ప్రాక్టీస్

ABN , First Publish Date - 2022-07-07T14:46:43+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కాబోయే భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ అంబాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు....

సీఎంకు కాబోయే భార్య Dr Gurpreet అంబాలా ఆసుపత్రిలో ప్రాక్టీస్

చండీఘడ్ (పంజాబ్): పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు కాబోయే భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ అంబాలా నగరంలోని ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురుప్రీత్ పెహోవాలోని టాగోర్ పబ్లిక్ స్కూలులో పాఠశాల విద్య అభ్యసించారు. అనంతరం అంబాలా నగరంలోని మెడికల్ కళాశాలలో 2017వ సంవత్సరంలో వైద్య విద్య పూర్తి చేశారు. వైద్య విద్య చదివాక అంబాలాలోని ఆసుపత్రిలో డాక్టరుగా ప్రాక్టీసు ప్రారంభించారు.గురుప్రీత్ కౌర్ సీఎం మాన్ తో రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఒక రోజు ముందు వరకు రహస్యంగా ఉంచారు.సీఎం భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఒకరికొకరు నాలుగేళ్లుగా తెలుసునని ఆమె బంధువులు చెబుతున్నారు. 


మాన్‌తో కలిసి గురుప్రీత్ ఎన్నికల ప్రచారం

గుర్‌ప్రీత్ 2019లో మన్‌ను కలిశారని, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో కలిసి ఎన్నికల ప్రచారం కూడా చేశారని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. మాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి గురుప్రీత్ కూడా హాజరయ్యారు.ముఖ్యమంత్రిగా పని చేస్తూ పెళ్లి చేసుకున్న మొట్ట మొదటి పంజాబ్ రాజకీయ నాయకుడిగా మాన్ చరిత్ర సృష్టించారు.అమెరికా పౌరసత్వం ఉన్న గురుప్రీత్ కౌర్ అక్క నవనీత్ కౌర్ నీరూ తన సోదరి పెళ్లి కోసం 20 రోజుల క్రితం తమ స్వగ్రామమైన హర్యానాలోని పెహోవాకు వచ్చిందని సమాచారం.గురుప్రీత్ కౌర్ కుటుంబం ఆరు నెలల క్రితమే మొహాలీకి మారింది.దీంతో సీఎం భగవంత్ మాన్ కూడా మొహాలీలో కొంతకాలం నివసించారని తాజాగా వెల్లడైంది. 


 సిక్కు మతాచారం ప్రకారం గురుద్వారాలో వివాహం

డాక్టర్ గురుప్రీత్ కౌర్ ముగ్గురు సోదరీమణుల్లో చిన్నది. ఆమె సోదరిలలో ఒకరు కేబినెట్ మాజీ మంత్రి, దివంగత జస్వీందర్ సింగ్ సంధు కుమారుడిని వివాహం చేసుకున్నారు. గురుప్రీత్ మేనమామలకు కూడా రాజకీయ నేపథ్యం ఉండటంతోపాటు ఈమె సాక్షాత్తూ సీఎం మాన్ ను వివాహమాడుతుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.సీఎం భగవంత్ మాన్, డాక్టర్ గురుప్రీత్ కౌర్ ఇద్దరూ సిక్కు మతాన్ని విశ్వసిస్తున్నందున, వారి వివాహం సిక్కు ఆచారాల ప్రకారం సంప్రదాయ ఆనంద్ కరాజ్ ప్రకారం గురుద్వారాలో ఘనంగా జరగనుంది. సీఎం మాన్ రెండో వివాహం పంజాబ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 


Read more