నా ఆరోగ్యంపై ఆందోళన వద్దు: నిత్యానంద

ABN , First Publish Date - 2022-05-18T08:03:41+05:30 IST

కైలాసదేశంలో ఉన్న తన ఆరోగ్యం గురించి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివాదాస్పద స్వామి నిత్యానంద తన ఫేస్‌బుక్‌లో ఓ సం దేశం వెలువరించారు.

నా ఆరోగ్యంపై ఆందోళన వద్దు: నిత్యానంద

చెన్నై, మే 17(ఆంధ్రజ్యోతి): కైలాసదేశంలో ఉన్న తన ఆరోగ్యం గురించి భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివాదాస్పద స్వామి నిత్యానంద తన ఫేస్‌బుక్‌లో ఓ సం దేశం వెలువరించారు. తనకు కేన్సర్‌ లేదని, అన్ని అవయవాలూ సక్రమంగా పనిచేస్తున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని తెలిపారు. అయితే తాను అన్నపానీయాలు తీసుకోలేకపోతున్నానని, బలవంతంగా ఆహారం తీసుకున్నా జీర్ణం కావడం లేదని పేర్కొన్నారు. తాను తరచూ నిర్వికల్ప సమాధిలోకి వెళుతున్నానని, నిత్యపూజలు మాత్రమే నిర్వహించగలుగుతున్నానని తెలిపారు. వైద్యనిపుణుల సలహా మేరకు పడుకుని శ్వాసప్రక్రియను మెరుగుపరచుకుంటున్నానని, ఆరు మాసాలుగా అన్నపానీయాలు తీసుకోలేక, నిద్ర లేమితో బాధపడుతున్నానని వివరించారు. మెరుగైన చికిత్సలందించే ఆస్పత్రులు లేకపోవడంతో తన శిష్యులుగా ఉన్న వైద్యనిపుణులే వైద్యం చేస్తున్నారని తెలిపారు. తానిప్పుడు జీవించాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు.

Read more