Former Union Minister: డీఎంకేకు సుబ్బులక్ష్మి గుడ్‌బై

ABN , First Publish Date - 2022-09-21T12:49:14+05:30 IST

అధికార డీఎంకేకు పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి సుబ్ములక్ష్మి జగదీశన్‌(Former Union Minister

Former Union Minister: డీఎంకేకు సుబ్బులక్ష్మి గుడ్‌బై

                          - సీనియర్లతో రెండోరోజూ స్టాలిన్‌ మంతనాలు


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 20: అధికార డీఎంకేకు పెద్ద షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి సుబ్ములక్ష్మి జగదీశన్‌(Former Union Minister Submulakshmi Jagadeesan) పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఈరోడ్‌ జిల్లా మొడకుర్చి నియోజకవర్గం నుంచి పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన సుబ్బులక్ష్మి.. గత కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తిగా వున్న విషయం తెలిసిందే. తన వ్యతిరేకులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం, తనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడం తదితరాల నేపథ్యంలో ఆమె పార్టీ కర్యకలాపాలకు దూరం గా వుంటున్నారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా(resignation) చేస్తూ  ఆగస్టు 29న పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు లేఖ రాసినట్లు సుబ్బులక్ష్మి మంగళవారం ప్రకటించారు. పెరియార్‌ సిద్ధాంతాలు నమ్మిన తాను వేరే పార్టీలో చేరే ఉద్దేశం లేదని, పార్టీ నుంచి, పార్టీ పదవి నుంచి తాను వైదొలగడానికి ఎవరి ప్రమేయం లేదని మీడియాకు వివరించారు. ఈ నిర్ణయం తనకు తానుగా స్వచ్ఛందంగా తీసుకున్నదేనని వెల్లడించారు. ఇదిలా ఉండగా వచ్చే నెల పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం జరుగనున్న నేపథ్యంలో, సీనియర్‌ నేతలతో స్టాలిన్‌ రెండో రోజైన మంగళవారం కూడా సమావేశమయ్యారు. కార్యవర్గ సమావేశం నిర్వహణా ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. 

Updated Date - 2022-09-21T12:49:14+05:30 IST