Reservation: దీపావళి ప్రత్యేక బస్సుల్లో 50 వేల మంది రిజర్వేషన్‌

ABN , First Publish Date - 2022-10-08T13:58:02+05:30 IST

దీపావళి(Diwali) పండుగ పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో ఇప్పటివరకు 50 వేల మంది ముందస్తు రిజర్వేషన్‌

Reservation: దీపావళి ప్రత్యేక బస్సుల్లో 50 వేల మంది రిజర్వేషన్‌

పెరంబూర్‌(చెన్నై), అక్టోబరు 7: దీపావళి(Diwali) పండుగ పురస్కరించుకొని సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో ఇప్పటివరకు 50 వేల మంది ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రజల సౌకర్యార్ధం దక్షిణ రైల్వే నడుపుతున్న ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్‌ పూర్తయ్యాయి. దీనికి తోడు విమాన ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో దీపావళి పండుగకు దక్షిణాది జిల్లాల్లోని ప్రముఖ నగరాలకు చెందినవారంతా చెన్నై నుంచి స్వస్థలాలకు బయలుదేరేందుకు ప్రభుత్వ రవాణా సంస్థ బస్సుల్లో టికెట్లను రిజర్వేషన్‌ చేసుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్ధం 21,22,23 తేదీల్లో ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) అదనపు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించింది. చెన్నై(Chennai) సహా పలు నగరాల నుంచి 21న ప్రయాణానికి 23 వేల మంది, 22న 21 వేల మంది, 23వ తేది  4 వేల మంది ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్నారని, ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-10-08T13:58:02+05:30 IST