ఐఆర్‌టీలో డిప్లొమాలు

ABN , First Publish Date - 2022-09-24T08:03:30+05:30 IST

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఐఆర్‌టీ) - డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంచింది.

ఐఆర్‌టీలో డిప్లొమాలు

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (ఐఆర్‌టీ) - డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంచింది. ఇవి ఏడాది వ్యవధి గల కరస్పాండెన్స్‌ కోర్సులు. అభ్యర్థులకు కాంటాక్ట్‌ తరగతులు నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్‌ మాధ్యమాల్లో అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. ఏ విభాగంలోనైనా మూడేళ్ల డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి / తత్సమాన కోర్సు పూర్తిచేసి కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు.


డిప్లొమా ప్రోగ్రామ్‌లు: ట్రాన్స్‌పోర్ట్‌ ఎకనామిక్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, మల్టీ- మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, రైల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

కోర్సు ఫీజు: రూ.10,000 

దరఖాస్తు ఫీజు: రూ.150

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31

Updated Date - 2022-09-24T08:03:30+05:30 IST