ఏపీ, రాజస్థాన్‌లో విద్యుత్ సంస్కరణలకు కేంద్రం ఓకే

ABN , First Publish Date - 2022-01-29T01:02:19+05:30 IST

విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలు చేపట్టే దిశగా రూ.7,309 కోట్ల అదనపు రుణ సేకరణకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ రెండు రాష్ట్రాలకు..

ఏపీ, రాజస్థాన్‌లో విద్యుత్ సంస్కరణలకు కేంద్రం ఓకే

న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో నిర్దిష్ట సంస్కరణలు చేపట్టే దిశగా రూ.7,309 కోట్ల అదనపు రుణ సేకరణకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ రెండు రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణ అధారత అదనపు రుణాలకు 11 రాష్ట్రాలు అనుమతి కోరినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో సంస్కరణల ప్రక్రియ ప్రారంభించేందుకు 5,186 కోట్ల అదనపు రుణాలకు రాజస్థాన్‌ను, 2.123 కోట్ల అదనపు రుణాలకు ఆంధ్రప్రదేశ్‌ను అనుమతించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


Read more