Shimla: సిగరెట్ నిరాకరించినందుకు రెస్టారెంట్‌లో కాల్పులు జరిపిన టూరిస్ట్

ABN , First Publish Date - 2022-09-20T22:58:19+05:30 IST

సిమ్లా రెస్టారెంట్‌లో గాలిలోకి కాల్పులకు దిగిన ఓ పర్యాటకుడిని మంగళవారం తెల్లవారుజామున..

Shimla: సిగరెట్ నిరాకరించినందుకు రెస్టారెంట్‌లో కాల్పులు జరిపిన టూరిస్ట్

సిమ్లా:  సిమ్లా (Simla) రెస్టారెంట్‌లో గాలిలోకి కాల్పులకు (Gunshots in air) దిగిన ఓ పర్యాటకుడిని (Tourist) మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. దుందుడుకుగా వ్యవహరించిన ఆ వ్యక్తిని విశ్వనాథ్ అనే టూరిస్టుగా గుర్తించారు.  ఛోటా సిమ్లా ఏర్పియాలోని హోటల్‌లో విశ్వనాథ్ బస చేస్తున్నాడు. బిజినెస్ వేళలు ముగిసినందున ఆహారం, సిగరెట్లు సరఫరా చేయడం సాధ్యం కాదని వెయిటర్ చెప్పడంతో తుపాకితో బెదరిస్తూ అతను గాలిలోకి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. 


ఈ ఘటనపై సిమ్లా పోలీస్ సూపరింటెండెంట్ మోనికా భుతుంగ్రు మాట్లాడుతూ, హోటల్‌లో బస చేసిన విశ్వనాథ్ అనే వ్యక్తి అర్థరాత్రి రెండు రౌండ్లు తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపి, తుపాకితోనే తన గదిలో తలుపు వేసుకున్నట్టు హోటల్ యజమాని తమకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నిందితుని అరెస్టు చేసి, ఐపీసీ సెక్షన్ 336, 506, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

Updated Date - 2022-09-20T22:58:19+05:30 IST