అమిత్ అరోరాను రెండు వారాల కస్టడీ కోరిన ఈడీ

ABN , First Publish Date - 2022-11-30T16:19:09+05:30 IST

మద్యం (Delhi Liquor Scam Case) కుంభకోణం కేసులో అమిత్ అరోరాను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది.

అమిత్ అరోరాను రెండు వారాల కస్టడీ కోరిన ఈడీ

ఢిల్లీ: మద్యం (Delhi Liquor Scam Case) కుంభకోణం కేసులో అమిత్ అరోరాను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచింది. అమిత్ అరోరాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో... చేతులు మార్చి.. ముడుపులు అందించిన పాత్రలో అమిత్ అరోరా ఉన్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. రూ.2.5 కోట్ల లంచం అమిత్ అరోరా వసూలు చేసినట్లు కోర్టులో పేర్కొంది. ఇప్పటివరకు ఈడీ ఎదుట 22 సార్లు హాజరయ్యారని, ఫోన్ ద్వారా కూడా సమాచారం తీసుకున్నారని అమిత్ అరోరా తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

22 సార్లు ప్రశ్నించిన తర్వాత కస్టడీ అవసరం ఏంటని ఈడీని కోర్టు ప్రశ్నించింది. అలాగే మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగింపు కోసమే... కస్టడీకి కోరుతున్నట్లు ఈడీ పేర్కొంది. ఫోన్ చేసి ఈడీ విచారణకు పిలిచిన ప్రతిసారి హాజరైనట్లు న్యాయవాది తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఈడీ విచారణకు పిలిచేదని... ఒక్కసారి కూడా మినహాయింపు కొరలేదని అరోరా న్యాయవాది పేర్కొన్నారు. మొబైల్ కూడా మార్చలేదని... అరోరా ఇంటిపై సీబీఐ కూడా దాడులు చేసిందని అరోరా న్యాయవాది కోర్టుకు తెలిపారు. విజయ్ నాయర్, సిసోడియాలను ఎప్పుడూ కలవలేదని, దినేష్ అరోరా గురించి మాత్రం తెలుసని అమిత్ అరోరా న్యాయవాది కోర్టుకు వివరించారు. అమిత్ ఆరోరాను ఏడు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు అనుమతించింది.

Updated Date - 2022-11-30T16:19:18+05:30 IST

Read more