చట్టంపై అభిప్రాయం తెలపడం తప్పు కాదు

ABN , First Publish Date - 2022-08-31T09:37:35+05:30 IST

పార్లమెంటు ఆమోదించిన చట్టంపై అభిప్రాయం తెలపకుండా పౌరులను అడ్డుకోవడం అంటే వాక్‌స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌

చట్టంపై అభిప్రాయం తెలపడం తప్పు కాదు

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన సోనియా, రాహుల్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంటు ఆమోదించిన చట్టంపై అభిప్రాయం తెలపకుండా పౌరులను అడ్డుకోవడం అంటే వాక్‌స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి విద్వేష ప్రసంగాలు చేసినందుకుగాను సోనియా, రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ వారు హైకోర్టులో అఫిడవిట్లు సమర్పించారు. ఈ కేసును ద్విసభ్య ధర్మాసనం వచ్చే 27కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా రాహుల్‌, సోనియాలు అఫిడవిట్లను వేర్వేరుగా సమర్పించారు.

Read more