కామన్‌ సిలబస్‌ అమలుపై స్పందించండి: ఢిల్లీ హైకోర్టు

ABN , First Publish Date - 2022-02-23T08:00:49+05:30 IST

దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కామన్‌ సిలబ్‌సను అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ....

కామన్‌ సిలబస్‌ అమలుపై స్పందించండి: ఢిల్లీ హైకోర్టు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లలో కామన్‌ సిలబ్‌సను అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) పరిధి నుంచి మదర్సాలు, వేద పాఠశాలలు, ఇతర మత విద్యాసంస్థలను మినహాయించడాన్ని సవాలు చేస్తూ అశ్వినీ ఉపాధ్యాయ్‌ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. ఈ మేరకు విద్యాహక్కు చట్టంలోని 1(4), 1(5) సెక్షన్లను కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. దేశంలోని పిల్లలందరికీ ఉచిత విద్యను మాత్రమే అందిస్తే సరిపోదని, ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. దీనికోసం కామన్‌ సిలబ్‌సను అమలుచేయాలని, కేంద్రం ఈ మేరకు బాధ్యత తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. 

Updated Date - 2022-02-23T08:00:49+05:30 IST