Datta Chaudhary: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-11-15T10:48:28+05:30 IST

వినూత్న ఆలోచనలతో విద్యార్థులు చదువులో ముందుకుసాగాలని డైనాప్‏పేడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరిజిత్‌ దత్తా చౌదరి(Datta Chaudhary) పిలుపునిచ్చారు. సోమవారం

Datta Chaudhary: వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి

- అరిజిత్‌ దత్తా చౌదరి పిలుపు

అడయార్‌(చెన్నై), నవంబరు 14: వినూత్న ఆలోచనలతో విద్యార్థులు చదువులో ముందుకుసాగాలని డైనాప్‏పేడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరిజిత్‌ దత్తా చౌదరి(Datta Chaudhary) పిలుపునిచ్చారు. సోమవారం వడపళనిలోని ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో ‘క్రాటర్‌ క్యూ 2022-23’ పేరుతో జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు జరిగిం ది. ఎస్‌ఆర్‌ఎం వళ్ళియమ్మాల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌ హరిణి రవి, ఎస్‌ఆర్‌ఎం గ్రూపు డిప్యూటీ డైరెక్టర్‌ (అడ్మిన్‌) డాక్టర్‌ ఎస్‌.రామచంద్రన్‌ సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అరిజిత్‌ దత్తా చౌదరి(Datta Chaudhary) సావనీర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని, వినూత్న ఆలోచనలతో విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా హాజరైన తమిళనాడు అపెక్స్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఫర్‌ లాజిస్టిక్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిరిధరన్‌ స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. అంతకుముందు అతిథులను మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఆర్‌.రాజారామన్‌ సాదర స్వాగతం పలికారు. ఇందులో వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 500 మంది విద్యార్థులు, కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T10:48:28+05:30 IST

Read more