రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా

ABN , First Publish Date - 2022-03-19T00:53:28+05:30 IST

టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా దాదాపు రెండేళ్ల తర్వాత కనిపించారు. రెండేళ్లక్రితం కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి దలైలామా బయట కనిపించడం మానేశారు.

రెండేళ్ల తర్వాత కనిపించిన దలైలామా

టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా దాదాపు రెండేళ్ల తర్వాత కనిపించారు. రెండేళ్లక్రితం కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి దలైలామా బయట కనిపించడం మానేశారు. బహిరంగంగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అయితే, ఇన్నాళ్లకు ధర్మశాలలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో దలైలామా కనిపించారు. తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం హెల్త్ చెకప్ కోసం ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అయితే తాను చాలా ఆరోగ్యంగా ఉండటం వల్ల ఢిల్లీ వెళ్లడం లేదని చెప్పారు. అవసరమైతే డాక్టర్‌తో బాక్సింగ్ ఆడగలనని అన్నారు. దలైలామా ఇలా కనిపించడంపై బౌద్ధులు, టిబెటన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Read more