Viral Video: వరద నీటితో కాలనీలోకి వచ్చిన మొసలి.. హడలిపోయిన స్థానికులు!

ABN , First Publish Date - 2022-08-16T01:41:57+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీటితో నగరాలు, గ్రామాలు మునిగిపోతున్నాయి.

Viral Video: వరద నీటితో కాలనీలోకి వచ్చిన మొసలి.. హడలిపోయిన స్థానికులు!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీటితో నగరాలు, గ్రామాలు మునిగిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లోని శివపురి జిల్లాలో ఒక మొసలి కాలనీలోకి (Crocodile enters residential area) వచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. శనివారం రాత్రి నుంచి శివపురిలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. శివపురి పాత బస్టాండ్‌ సమీపంలోని నీట మునిగిన ఓ కాలనీలోకి ఆదివారం ఒక మొసలి వచ్చింది. దానిని చూసి భయపడిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


పోలీసులు వెంటనే స్పందించి మాధవ్ నేషనల్ పార్క్ సిబ్బందిని రప్పించారు. సుమారు గంట సేపు ప్రయత్నించిన తర్వాత ఎనిమిది అడుగుల పొడవున్న ఆ మొసలిని జూ అధికారులు పట్టుకున్నారు. భారీ వర్షాల వల్ల సమీపంలోని కాలువ నుంచి ఆ మొసలి కాలనీలోకి ప్రవేశించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ మొసలిని స్థానిక సంఖ్యా సాగర్ సరస్సులో విడిచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

Updated Date - 2022-08-16T01:41:57+05:30 IST