Congress and CPM: ఎయిమ్స్‌ భవనాలు ఎవరైనా దొంగిలించారా..!

ABN , First Publish Date - 2022-09-24T15:13:07+05:30 IST

మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రి భవనాలు ఎవరైనా దొంగిలించారా? అంటూ విరుదునగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్‌ఠాగూర్‌, మదురై సీపీఎం ఎం

Congress and CPM: ఎయిమ్స్‌ భవనాలు ఎవరైనా దొంగిలించారా..!

                     - నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, సీపీఎం ఎంపీల ఎద్దేవా


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 23: మదురై ఎయిమ్స్‌ ఆస్పత్రి భవనాలు ఎవరైనా దొంగిలించారా? అంటూ విరుదునగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్‌ఠాగూర్‌, మదురై సీపీఎం ఎంపీ ఎస్‌.వెంకటేశన్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారైక్కుడిలో గురువారం రాత్రి జరిగిన బహిరంగ సభలో, మదురై ఎయిమ్స్‌ ఆసుపత్రి నిర్మాణపనులు 95 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌ ఆస్పత్రి ప్రాంతాన్ని పరిశీలించిన ఇద్దరు ఎంపీలు, అబద్ధాల మాటలతో ప్రజలను మోసం చేయలేరని, అన్నిరకాల ధరలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘95 శాతం పూర్తయిన పనులు ఎక్కడా’ అనే బోర్డును ఎంపీలు ప్రదర్శించారు.

Read more