తీవ్ర కొవిడ్‌ బాధితులకు మానసిక సమస్యల ముప్పు

ABN , First Publish Date - 2022-03-16T08:09:55+05:30 IST

తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరినవారికి.. వారానికి మించి మంచంపట్టిన వారికి మానసిక సమస్యల ముప్పు పొంచి ఉందని ఐస్‌లాండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు..

తీవ్ర కొవిడ్‌ బాధితులకు  మానసిక సమస్యల ముప్పు

  ‘ది లాన్సెట్‌’ అధ్యయన నివేదిక 

లండన్‌, మార్చి 15 : తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రుల్లో చేరినవారికి.. వారానికి మించి మంచంపట్టిన వారికి మానసిక సమస్యల ముప్పు పొంచి ఉందని ఐస్‌లాండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ సోకినప్పటి నుంచి మొదలుకొని దాదాపు 16 నెలల వరకు ఈ గండం వెంటాడే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి నుంచి 2021 ఆగస్టు మధ్యకాలంలో డెన్మార్క్‌, ఎస్టోనియా, ఐస్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, బ్రిటన్‌ దేశాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయి, ఆస్పత్రుల్లో చేరిన వేలాది మందిపై జరిపిన అధ్యయనంలో ఈవివరాలు వెల్లడయ్యాయి. వీరిలో చాలామంది దాదాపు 16 నెలలు గడిచినా.. ఏదో భయం, దిగులు, కుంగుబాటుతో కుమిలిపోయారని పేర్కొన్నారు. కొవిడ్‌ సోకినప్పటికీ ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం రాని వారిని కూడా ఈ తరహా భయాలు వెంటాడినప్పటికీ.. రెండు నెలల్లోనే అవి మటుమాయమయ్యాయని వివరించారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ది లాన్సెట్‌ పబ్లిక్‌ హెల్త్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. 

Read more