గుండె రక్తనాళాలపై కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2022-02-23T08:04:49+05:30 IST

కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌...

గుండె రక్తనాళాలపై కరోనా దెబ్బ

 వర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

లండన్‌, ఫిబ్రవరి 22: కరోనా వైరస్‌.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను ఇన్ఫెక్ట్‌ చేయకుండానే వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ (యూకే) పరిశోధకుల బృందం అధ్యయనంలో తేలింది. తమ పరిశోధనలో భాగంగా.. గుండెలోని సూక్ష్మ రక్తనాళాలను కప్పి ఉంచే పెరిసైట్స్‌పైకి కరోనా వేరియంట్లన్నింటినీ ప్రయోగించారు. కానీ, అవేవీ పెరిసైట్స్‌ను ఇన్ఫెక్ట్‌ చేయలేకపోయాయి. అయితే.. కేవలం స్పైక్‌ ప్రొటీన్లను ప్రయోగించినప్పుడు మాత్రం.. ఆ ప్రొటీన్లు ఎండోథీలియల్‌ కణాలతో సంభాషించకుండా పెరిసైట్లను నియంత్రించడమే కాక, వాపును కలిగించే సైటోకైన్లను స్రవించేలా చేసినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకిన రోగుల్లో ఉండే  స్పైక్‌ ప్రొటీన్లు, మొత్తం రక్తప్రసరణ వ్యవస్థ అంతా ప్రయాణిస్తూ అన్ని అవయవాలనూ దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ అధ్యయనాన్ని ‘క్లినికల్‌ సైన్స్‌’ జర్నల్‌లో వారు ప్రచురించారు.

Read more