Corona vaccine: ఒకే రోజు 12.62 లక్షల మందికి టీకాలు

ABN , First Publish Date - 2022-09-13T15:52:13+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌(Mega Vaccination) డ్రైవ్‌లో 12.62 లక్షల మంది టీకాలు వేశారు. ఈ మేరకు

Corona vaccine: ఒకే రోజు 12.62 లక్షల మందికి టీకాలు

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 12: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌(Mega Vaccination) డ్రైవ్‌లో 12.62 లక్షల మంది టీకాలు వేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో, చెన్నైలో 2 వేలు సహా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ప్రత్యేక శిబిరాల్లో 61,202 మందికి మొదటి డోస్‌, 2,98,634 మందికి రెండవ డోస్‌, 9,02,253 మందికి బూస్టర్‌ డోస్‌ వేసినట్లు తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18 ఏళ్ల పైబడిన వారు 96.49 శాతం మంది మొదటి డోస్‌, 91.09 శాతం మంది రెండు డోస్‌లు వేసుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.

Updated Date - 2022-09-13T15:52:13+05:30 IST