20 వేలలోపే Covid యాక్టివ్ కేసులు
ABN , First Publish Date - 2022-02-19T16:56:34+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ థర్డ్‌వేవ్ ప్రబలాక ఒకటిన్నర నెల తర్వాత యాక్టివ్ కేసులు 20వేలలోపే ఉండడం ఊరటనిచ్చే అంశం. శుక్రవారం 1,333 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 705 మంది, 9 జిల్లాల్లో

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ థర్డ్‌వేవ్ ప్రబలాక ఒకటిన్నర నెల తర్వాత యాక్టివ్ కేసులు 20వేలలోపే ఉండడం ఊరటనిచ్చే అంశం. శుక్రవారం 1,333 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 705 మంది, 9 జిల్లాల్లో పది మందిలోపు బాధితులు నమోదయ్యారు. మిగిలిన జిల్లాల్లో వందలోపు ఉన్నారు. 4,890 మంది కోలుకోగా 19 మంది మృతిచెందారు. బెంగళూరులో 9 మంది, ధార్వాడలో ఇద్దరు, ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 30 జిల్లాల్లో 16,184మంది చికిత్స పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 7,661 మంది అత్యల్పంగా బీదర్‌లో 35మంది ఉన్నారు.