J-K: పుల్వామాలో ఉగ్రదాడి, పోలీసు మృతి, గాయపడిన సీఆర్‌పీఎఫ్ జవాను

ABN , First Publish Date - 2022-10-02T22:45:59+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు ఆదివారంనాడు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు..

J-K: పుల్వామాలో ఉగ్రదాడి, పోలీసు మృతి, గాయపడిన సీఆర్‌పీఎఫ్ జవాను

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా (pulwama)లో ఉగ్రవాదులు ఆదివారంనాడు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడ్డాడు. వెంటనే అతనిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే అదనపు బలగాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ  అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు  చర్యలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.


కాగా, దీనికి ముందు షిపియాన్ జిల్లా  బాస్కుచన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుని సోఫియాన్‌కు చెందిన నసీర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఏకే రైఫిల్ సహా పలు ఆయుధాలు, మందుగుండ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రెండ్రోజుల క్రితమే బారాముల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఇద్దరు స్థానిక టెర్రరిస్టులను సంయుక్త బలగాలు మట్టుబెట్టాయి.

Read more