గోవాలో వివాదాస్పద కేఫ్‌ లైసెన్సు..

ABN , First Publish Date - 2022-09-10T08:30:46+05:30 IST

గోవాలోని వివాదాస్పద ‘సిల్లీ సోల్స్‌’ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌కు ఆహార లైసెన్సును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ భర్త, పిల్లల.

గోవాలో వివాదాస్పద కేఫ్‌ లైసెన్సు..

కేంద్ర మంత్రి స్మృతి భర్త కంపెనీదే!

ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడి

ఆ కంపెనీతో తమకు సంబంధం లేదని

ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన మంత్రి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: గోవాలోని వివాదాస్పద ‘సిల్లీ సోల్స్‌’ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌కు ఆహార లైసెన్సును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ భర్త, పిల్లల అధీనంలోని కంపెనీకే ఇచ్చినట్లు వెల్లడైంది. గోవాలోని అసగావోలో ఓ ఇంట్లో సిల్లీ సోల్స్‌ కేఫ్‌ అండ్‌ బార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌ విషయంలో తనపై అపవాదులు మోపారంటూ కేంద్ర మంత్రి స్మృతి కాంగ్రెస్‌ నాయకులపై దావా కూడా వేశారు. తనకు, తన కుమార్తెకు సిల్లీ సోల్స్‌తో ఎలాంటి సంబంధం లేదని గత నెలలో స్మృతి ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. సిల్లీ సోల్స్‌కు మద్యం లైసెన్సును అక్రమంగా రెన్యువల్‌ చేయించారంటూ గోవా ఎక్సైజ్‌ కమిషనర్‌ గత జూలైలో నోటీసులు ఇచ్చిన నాటి నుంచి స్మృతి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.


ఈ నేపథ్యంలో గతంలో బార్‌కు ఎక్సైజ్‌ లైసెన్సు అక్రమంగా రెన్యువల్‌ చేయించుకున్నారన్న సమాచారాన్ని సేకరించిన న్యాయవాది ఎయిర్స్‌ రోడ్రిగ్స్‌ తాజాగా ఆర్టీఐ దరఖాస్తు చేశారు. గోవా ప్రభుత్వం దానికి జవాబిస్తూ.. సిల్లీ సోల్స్‌కు ఆహార లైసెన్సును ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ పేరిట ఇచ్చినట్లు తెలిపింది. ఈ కంపెనీలు స్మృతి భర్త, కుటుంబ సభ్యులవి. వారికి 75తిు వాటా ఉంది. ఎయిటాల్‌ ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ కంపెనీకి ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏ లైసెన్సు జారీ చేయగా.. అదే లైసెన్సును సిల్లీ సోల్స్‌కు వాడుతున్నారు. 

Updated Date - 2022-09-10T08:30:46+05:30 IST