అమృత్‌సర్‍లో దారుణం.. ఐదుగురు జవాన్ల మృతి

ABN , First Publish Date - 2022-03-06T18:49:39+05:30 IST

తోటి జవాన్లపై బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జరిపిన దాడుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‍లోని ఖాసా గ్రామంలో ఉన్న బీఎస్ఎఫ్ మెస్‌లో ఆదివారం మధ్యాహ్నం జవాన్లు లంచ్ చేస్తుండగా, సత్తెప్ప అనే కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు.

అమృత్‌సర్‍లో దారుణం.. ఐదుగురు జవాన్ల మృతి

తోటి జవాన్లపై బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ జరిపిన దాడుల్లో ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అమృత్‌సర్‍లోని ఖాసా గ్రామంలో ఉన్న బీఎస్ఎఫ్ మెస్‌లో ఆదివారం మధ్యాహ్నం జవాన్లు లంచ్ చేస్తుండగా, సత్తెప్ప అనే కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన సత్తెప్త కూడా గాయాలపాలై మరణించాడు. గాయపడ్డ జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయాలపాలైన జవాన్లను స్థానిక గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. కాల్పుల వెనుకగల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు.

Read more