Punjab సీఎం ఛన్నీపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-02-18T16:44:13+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పాట్నా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు....

Punjab సీఎం ఛన్నీపై పాట్నా పోలీసులకు ఫిర్యాదు

పాట్నా(బీహార్): పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పాట్నా నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు చెందిన భయ్యాల గురించి అవమానకరమైన వ్యాఖ్య చేసినందుకు పాట్నాలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.భారతీయ జనతా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు మనీష్ కుమార్ సింగ్ కదమ్ కువాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీకి చెందిన వ్యక్తుల గురించి పంజాబ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తన మనోభావాలను దెబ్బతీశాయని, దీంతో ఫిర్యాదు చేయడానికి తనను ప్రేరేపించారని యువ బీజేపీ నాయకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్, బీహార్‌కు చెందిన వారిపై ఆయన అనవసరమైన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చన్నీపై తీవ్ర  విమర్శలు చేశారు.ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సోదరులను పంజాబ్‌లో అడుగు పెట్టనివ్వబోమంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌షోలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక చిరునవ్వు నవ్వుతూ చప్పట్లు కొట్టారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ తీవ్రంగా మండిపడ్డాయి. చన్నీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. Read more