tmc ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి Bailable warrant

ABN , First Publish Date - 2022-05-07T17:24:50+05:30 IST

బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం బెయిలబుల్ వారంట్ జారీ...

tmc ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి Bailable warrant

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): బొగ్గు స్మగ్లింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)శనివారం బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.రుజీరా బెనర్జీకి ఈడీ గతంలో పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదు. దీంతో రుజీరా బెనర్జీకి బెయిలబుల్ వారెంట్‌ను ఈడీ జారీ చేసింది.ఇప్పటికే బొగ్గు అక్రమ రవాణా కేసులో అభిషేక్ బెనర్జీని ఈడీ రెండుసార్లు ప్రశ్నించింది. ఈ ఏడాది మార్చి 21, 22వ తేదీల్లో ఢిల్లీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజీరాలకు ఈడీ సమన్లు ​​పంపింది. బెనర్జీ,అతని భార్య ఈడీ సమన్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఈడీ తనను, తన భార్యను ఢిల్లీలో కాకుండా కోల్‌కతాలో ప్రశ్నించాలని ఎంపీ అభిషేక్ పదేపదే కోరారు.


అభిషేక్ బెనర్జీని మార్చిలో ఈడీ కార్యాలయంలో అధికారులు ఎనిమిది గంటలపాటు ప్రశ్నించారు. అయితే అతని భార్య మాత్రం విచారణకు హాజరు కాలేదు.దుర్గాపూర్-అసన్సోల్ బెల్ట్, జార్ఖండ్ ల నుంచి అక్రమంగా బొగ్గును వెలికితీసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది.అభిషేక్ బెనర్జీ తండ్రి అమిత్ బెనర్జీ లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరని ఆరోపణలు వచ్చాయి. అభిషేక్ భార్య రుజీరా బెనర్జీ అతని తండ్రితో పాటు లీప్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు.


Read more