Cmdaలో తొలి మహిళా డ్రైవర్
ABN , First Publish Date - 2022-07-13T13:06:43+05:30 IST
చెన్నై నగర అభివృద్ధి సంస్థ (సీఎండీఏ)లో తొలిసారిగా మహిళా డ్రైవర్ నియమితులయ్యారు. రాష్ట్ర రవాణా శాఖతో పాటు పలు శాఖల్లో మహి ళా డ్రైవర్లు
పెరంబూర్(చెన్నై), జూలై 12: చెన్నై నగర అభివృద్ధి సంస్థ (సీఎండీఏ)లో తొలిసారిగా మహిళా డ్రైవర్ నియమితులయ్యారు. రాష్ట్ర రవాణా శాఖతో పాటు పలు శాఖల్లో మహిళా డ్రైవర్లు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీఎండీఏలో తొలి మహిళా డ్రైవర్గా కొడుంగైయూర్కు చెందిన ఇందుప్రియ (34) నియమితులయ్యారు. గుమ్మిడిపూండిలోని రవాణా సంస్థ శిక్షణా కార్యాలయంలో శిక్షణ పొందిన ఇందుప్రియకు సీఎండీఏలో డ్రైవర్గా గృహ వసతి, నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.ముత్తుస్వామి మంగళవారం నియామక పత్రాలు అందజేశారు.