రూ.1588 కోట్లతో కంప్రెషర్ల కర్మాగారం

ABN , First Publish Date - 2022-03-16T15:40:56+05:30 IST

శ్రీపెరుంబుదూరులోని శామ్‌సంగ్‌ సంస్థ తన పారిశ్రామిక విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా రూ.1588 కోట్ల పెట్టుబడితో కొత్తగా కంప్రెషర్ల తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. ఆ మేరకు చెన్నై స్టార్‌హోటల్‌లో మంగళవారం

రూ.1588 కోట్లతో కంప్రెషర్ల కర్మాగారం

          - సీఎం స్టాలిన్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం


చెన్నై: శ్రీపెరుంబుదూరులోని శామ్‌సంగ్‌ సంస్థ తన పారిశ్రామిక విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా రూ.1588 కోట్ల పెట్టుబడితో కొత్తగా కంప్రెషర్ల తయారీ యూనిట్‌ నెలకొల్పనుంది. ఆ మేరకు చెన్నై స్టార్‌హోటల్‌లో మంగళవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో ప్రభుత్వంతో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కొత్త యూనిట్‌ ద్వారా 600 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. యేడాదికి 80లక్షల కంప్రెషర్లను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా ఈ కొత్త యూనిట్‌ను ఈ యేడాది ఆఖరులోగా నిర్మించనున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు, ఆ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, పారిశ్రామిక మార్గదర్శక సంస్థ సీఈవో పూజా కులకర్ణి, సిప్కాట్‌ ఎండీ డి.ఆనంద్‌, శామ్‌సంగ్‌ ఎలక్ర్టానిక్స్‌ సీఈవో కెన్‌ కాంగ్‌, ఆ సంస్థ చెన్నై యూనిట్‌ ఎండీ పియోంగ్‌ జిన్‌ కాంగ్‌, ఉపాధ్యక్షుడు  సియోంగ్‌ టీక్‌ లిమ్‌, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీటర్‌ రీ తదితరులు పాల్గొన్నారు.

Read more