Congratulations: స్టాలిన్‌కు 7 రాష్ట్రాల సీఎంల అభినందన

ABN , First Publish Date - 2022-07-29T15:32:16+05:30 IST

చెన్నై వేదికగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను పురస్కరించుకుని రాష్ట్ర

Congratulations: స్టాలిన్‌కు 7 రాష్ట్రాల సీఎంల అభినందన

అడయార్‌(చెన్నై), జూలై 28: చెన్నై వేదికగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌(Chess Olympiad) పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin)కు ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. మహాబలిపురం(Mahabalipuram)లో జరిగే 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు విజయవంతంగా నిర్వహిచాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌(Arunachal Pradesh) ముఖ్యమంత్రి ఫెమా ఖండు, సిక్కిం సీఎం ప్రేమ్‌ సింగ్‌ తమాంగ్‌లతోపాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఫోన్‌ ద్వారా తమ అభినందనలు తెలిపినట్టు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-29T15:32:16+05:30 IST